Excessive Food Eating | తిండి తగ్గించాలనుకున్నా వల్ల కావట్లేదా.. ఈ టిప్స్ పాటించండి..

-

Excessive Food Eating | అధిక బరువు వల్లనో మరే ఇతర కారణాల వల్లనో ఇక నుంచి తిండి తగ్గించాలి, డైట్ మెయింటెన్ చేయాలని అని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునే వారు రెండు మూడు రోజులకు ఒకసారైనా అనుకుంటారు. కానీ నోటి రుచి కోరినప్పుడో, ఎదురుగా నచ్చిన ఆహారం ఉన్నప్పుడు, మరే ఇతర సమయాల్లోనే మన ఆలోచన ఏటో కొట్టుకుపోతుంది. ఆహారాన్ని ఒక పట్టు పట్టేస్తాం. మరికొందరు అప్పటి వరకు తక్కువ తినాలి అనుకున్నా.. తినడానికి కూర్చోగానే అనుకున్న దగ్గర బండి ఆగదు. లాగించి పడేస్తారు.

- Advertisement -

ఈ సమస్యను ఫేస్ చేసే వారు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా తమ ఆహారంపై నియంత్రణ తెచ్చుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మన డైట్‌ను మనం అనుకున్నట్లు ప్లాన్ చేసుకోవడం సులువవుతుంది. ఆహారం విషయంలో పెట్టుకున్న గోల్స్‌ను రీచ్ అవ్వగలుగుతాం. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దామా..

నిదానంగా.. నీరు తాగుతూ: ఆహారాన్ని పరుగులు పెడుతున్నట్లు కాకుండా నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ఆహారాన్ని బాగా నమిలి తినడం ప్రారంభిస్తాం. ఇది ఆహారాన్ని తిన్న భావన కలిగేలా చేస్తుంది. ఆహారం శరీరానికి పడుతుంది. ఎక్కువ సేపు తిన్నట్లుగా కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఆహారం తినే మధ్యలో నీరు తాగుతుండాలి. దీని వల్ల పొట్ట త్వరగా నిండినట్లు అనిపించి తక్కువ మోతాదులో తింటాం. అధికంగా తినడం నుంచి ఉపశమనం పొందుతాం.

చిన్నప్లేట్ వాడండి: వీటితో పాటుగా ఆహారం తక్కువ తీసుకోవాలి అనుకునే వారు చిన్న ప్లేట్లు వినియోగించడం మొదలు పెట్టాలి. చిన్న ప్లేట్ వల్ల ఆహారం కూడా తక్కువగానే పెట్టుకుంటాం. దీంతో మరింత కావాలంటే రెండోసారి వడ్డించుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువగా తినాలనే ఆలోచన గుర్తుకు వచ్చి.. మన ఆహారాన్ని నియంత్రించుకోవడం సులభతరమవుతుంది.

అలా కాకుండా పెద్దపెద్ద ప్లేట్లు వినియోగిస్తే ఎంత పెట్టుకున్నా కాస్తేగా అన్న ఫీల్ కలిగి కంట్రోల్ తప్పి మళ్ళీ భారీగా తినేసే అవకాశం పెరుగుతుంది. అందుకే తక్కువగా తినాలని అనుకునే వారు చిన్న ప్లేట్లు, బౌల్స్ వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఫైబర్ ఫుడ్: వీటితో పాటుగా ఫైబర్ స్థాయిలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. అదే విధంగా తీసుకున్న ఆహారం మెల్లిగా జీర్ణం అవుతూ త్వరగా ఆకలి వేయదు. దీని వల్ల ఎక్కువ తినడాన్ని కంట్రోల్ చేయొచ్చు.

ఫోన్లు, టీవీలో చూడొద్దు: డైట్ మెయింటెయిన్ చేయాలని, తక్కువ తినాలి అనుకునే వారు భోజనం చేసే సమయంలో టీవీ, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. టీవీ, మొబైల్ చూడటం వల్ల మన దృష్టి అంతా వాటిపైనే ఉంటుంది. దాంతో ఎంత తింటున్నామో చూసుకోకుండా ఎక్కువ ఆహారం తినేస్తాం. అందుకే ఆహారం తినే సమయంలో వీటిని పూర్తిగా దూరం పెట్టాలని, అప్పుడే ఆహారంపై నియంత్రణ సాధ్యమవుతుందని వైద్యులు చెప్తున్నారు.

బబుల్ గమ్: కొంతమందికి చీటికి మాటికి ఆకలి వేస్తుంది. భోజనం చేసిన గంట కల్లా ఆకలిగా అనిపిస్తుంది. వారు బబుల్ గమ్ నమలడం అలవాటు చేసుకోవాలి. బబుల్ గమ్ నములుతూ ఉండటం వల్ల స్నాక్స్ తినాలనే ఆశ తగ్గుతుంది. అంతేకాకుండా బబుల్ వల్ల ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోలేమని(Excessive Food Eating), దాంతో ఆటోమేటిక్‌గా ఆహారంపై నియంత్రణ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also: గురక సమస్య సతాయిస్తోందా…. ఇలా ట్రై చేయండి..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...