High BP | హైబీపీ రాకూడదంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

-

ప్రస్తుత పోటీ ప్రపంచంలో చిన్న వయసులోనే అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి. వాటిలో అధిక మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య రక్తపోటు అని నిపుణులు అంటున్నారు. యువకుల్లో కూడా ఈ రక్తపోటు సమస్య అధికంగా ఉంటుందని, విద్యార్థి దశ నుంచే ఈ సమస్యలు మొదలవుతుందని వైద్యులు చెప్తున్నారు. బీపీ(High BP)నేగా అని కొట్టి పారేస్తే ఇది ప్రాణాంతక సమ్యగా మారొచ్చని, దీనిని గుర్తించినప్పటి నుంచి నియంత్రణకు చర్యలు చేపట్టడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

అయితే బీపీ ఒక్కసారి వచ్చిందంటే అది నయం కాదు. దానిని నియంత్రణలో ఉంచుకోవడం ఒక్కటే మార్గం. ఏమాత్రం ఆవేశపడినా, ఆహారంలో ఒక్కసారిగా ఉప్పు, కారాలు పెరిగినా బీపీ పెరిగి తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతుంది. అంతేకాకుండా హైబీపీ సమస్య ఉంటే దాంతో పాటు మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, కంటి సమసయలు వంటి వాటికి కూడా హైబీపీ కారణం కావొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హైబీపీ సమస్య రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా హైబీపీని రాకుండా చేయడమే కాకుండా.. వచ్చినా కూడా నియంత్రించడం సులభతరం అవుతుందని వైద్యులు అంటున్నారు.

బరువు: హైబీపీ(High BP)ని కంట్రోల్ చేయాలంటే ముందుగా మన బరువును కంట్రోల్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. ఊబకాయం ఉంటే హైబీపీ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. నరాలపై ఒత్తిడి పెరడం వల్ల హైబీపీ వస్తుంది. అందుకే హైబీపీ సమస్య రాకూడదంటే ముందుగా మనం మన బరువును నియంత్రణలో ఉంచుకోవాలి.

మన ఎత్తును బట్టి బరువును మెయింటెయిన్ చేయాలి. అధిక బరువు ఉండకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేయడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలు అందే ఆహారాన్ని తీసుకోవాలి.

ఉప్పు, కారాలు తగ్గించాలి: హైబీపీ రాకూడదన్నా, వచ్చిన రక్తపోటు నియంత్రణలో ఉండాలన్నా నోటిని కాస్తంత అదుపులో పెట్టుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఆహారంలో ఉప్పు, కారాలతో పాటు రక్తపోటుకు ధాతువులుగా పనిచేసే వాటిని గణనీయంగా తగ్గించుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్, ప్యాక్‌డ్ ఫుడ్‌ను దూరం పెట్టాలి.

వ్యాయామం తప్పనిసరి: తరచూ వ్యాయామం చేసే వారికి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల మన రక్తపోటు కంట్రోల్‌లో ఉంటుంది. శరీరమంతా రక్తసరఫరా సాఫీగా జరుగుతుంది. హైబీపీ తగ్గుతుంది.

పూర్తి ఆరోగ్యానికి కూడా వ్యాయామం చాలా మేలు చేస్తుంది. వారంలో కనీసం 150 నిమిషాల పాటు అయినా వ్యాయామాలు చేయాలి. వేగంగా నడవడం, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వాటిని చేయడం కూడా చాలా మంచిది.

ధూమపానం, మద్యపానం నోనో: పొగతాగడం, మద్యం సేవించడం సాధారణంగానే మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఇవి తీసుకుంటే మన రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి అలవాటు అయిపోయి ఉంటే మానేయడానికి ప్రయత్నించాలి. కుదిరితే సిగరెట్లు, బీడీలు తాగడం, మద్యం సేవించడం, పొగాకు ఉత్పత్తులు వాడడం పూర్తిగా మానేయాలి.

ఒత్తిడి వద్దు: వీటితో పాటుగా అధికంగా ఒత్తిడికి గురికాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒత్తిడి పెరిగిందంటే దాంతో పాటే మన రక్తపోటు కూడా పెరుగుతూ పోతుంది. ఇదే ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే హైబీపీ వస్తుంది. అందుకే హైబీపీ రిస్క్‌ను తగ్గించుకోవడం కోసం రోజువారీ జీవితంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. డీప్ బ్రీత్ వ్యాయామం చేయాలి. దేని వల్ల మనపై ఒత్తిడి పెరుగుతుందో గుర్తించి దానిని తగ్గించుకోవాలి. స్ట్రెస్ రిలీఫ్ పనులు చేయాలి.

డైట్: హైబీపీ రాకూడదంటే మన డైట్‌ను మెయింటెయిన్ చేయడం కూడా చాలా ముఖ్యం. బీపీ రాకుండా చేసే డైట్‌ను డయాష్ (DASH) అంటారు. ఇందులో పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు, ప్రొటీన్, కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు కచ్చితంగా తినాలని ఉంటుంది. సోడియం, సాచురేటెడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఈ డైట్‌లో తీసుకోవాలి. ఈ డైట్ పాటించడం ద్వారా హైబీపీ(High BP) బాగా తగ్గుతుంది.

Read Also:  చిలగడ దుంపతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...