Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

-

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ది కాదు. మంచంపైనే అలా పడుకుని ఉండాలనిపిస్తుంది. శరీరంలో శక్తే లేనట్లు నీరసంగా కూడా అనిపిస్తుంది. సరిపడా నిద్ర పోయినప్పుడు కూడా ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది. గాఢ నిద్ర పోయిన సందర్బాల్లో కూడా ఈ ఫీలింగ్స్‌ను మనం చూస్తుంటాం. కానీ ఇది తరచూ ఉంటుంటే మాత్రం మంచిది కాదు.

- Advertisement -

ఇలాంటి సమస్యను అధిగమించి ఉదయాన్నే నిద్ర లేచిన సమయంలో కూడా ఎనర్జిటిక్‌గా ఉండాలంటే సింపుల్ యోగాసానాలు కొన్ని వేస్తే సరిపోతుందని యోగి గురువులు చెప్తున్నారు. ఈ ఆసనాలను తరచూ వేయడం ద్వారా శరీరం చాలా ఎనర్జిటిక్‌గా మారుతుందని, అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దరిచేరవని చెప్తున్నారు. మరి ఆ ఆసనాలేంటో ఒకసారి చూద్దామా..

గరుడాసనం: ఈ ఆసనం వేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా ఆందోళన వంటి భావనలు తగ్గుతాయి. రిలాక్స్ అయిన భావన కలుగుతుంది. ఒక చోట నిలబడి కాళ్లు చేతులు మెలేసినట్లు ఉండే ఈ భంగిమ అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. మన శారీరక బ్యాలెన్స్‌ను పెంచుతుంది.

శరీర వ్యర్థాలను సులభంగా బయటకు పంపేలా శరీరాన్ని ప్రేరేపిస్తుంది. శరీరంలో ఎనర్జీ స్థాయలను పెంచుతుంది. ఈ ఆసనం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగు పడి గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మెడ, భుజాల నొప్పి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

బాలాసనం(Child Pose): ఈ ఆసనం ద్వారా లెక్కలేనన్న ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆసనం కూడా ఆందోళనను తగ్గించి మనశ్శాంతిని పెంచుతుంది. ఈ ఆసనం వేయడం ద్వారా వెన్ను, ఛాతి, భుజాలు రిలాక్స్ అవుతాయి. నీరసం, సత్తవ లేనట్లు ఉండే భావనలు తొలగుతాయి. శక్తి పెరిగిన భావన కలుగుతుంది. ఈ ఆసనం వేయడానికి ఒక చోటు మోకాళ్లపై కూర్చోవాలి.

అనంతరం శరీరాన్ని వంచి మోచేతులతో నేలను తాకాలి. అతి ఒక 30 క్షణాలు ఉన్న తర్వాత మెల్లిగా సాధారణ స్థితిక చేరుకోవాలి. ఇలా రోజూ కనీసం 20 సార్లు చేస్తే అద్భుతమైన మార్పును గమనించొచ్చు. పిల్లలు బోర్లా పడుకున్న భంగిమలో ఈ ఆసనం ఉంటుంది. అందుకే దీనికి బాలాసనం అని పేరు వచ్చిందని కొందరు చెప్తుంటారు.

వీరభద్రాసనం: ఈ ఆసనం వేయడం కూడా శరీర అవయవాలన్నీ ఫ్రీ అవుతాయి. ఈ ఆసనం మన రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. ఆక్సిజన్ సరఫరాలు పెంచుతుంది. ఎర్జీని అధికం చేస్తుంది. భుజాల సామర్థ్యాన్ని, శరీర బ్యాలెన్స్‌ను పెంచుతుంది.

ఈ ఆసనం వేయడానికి నిఠారుగా నిల్చోవాలి. ఒక కాలికి వెనకు తీసుకెళ్లాలి. పెద్ద అంగ వేస్తున్న క్రమంలో నిల్చుని. ముందు కాలును వంచాలి. ఆ భంగిమలో ఉండి.. చేతులను పైకి లేపి నమస్కారం పెడుతున్న భంగిమలో ఉంచాలి. అదే విధంగా కాళ్లను మార్చి మరోసారి చేయాలి. ఇలా రోజూ చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

ధనురాసనం(Dhanurasana): ఈ ఆసనం వేయడానికి ముందుగా బోర్లా నేలపై పడుకోవాలి. అక్కడి నుంచి మన చేతులను వెనకకు పెట్టి మన పాదాలను అందుకోవాలి. ఈ ఆసనం వేసిన సమయంలో కాళ్లు, చేతుల కండరాలపై అధిక ఒత్తిడి ఉంటుంది. మన బరువు అంతా కూడా పొత్తికడుపుపై ఉంటుంది. దీని వల్ల మలబద్దకం లాంటి కడుపు సమస్యలు తగ్గుతాయి. శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఎనర్జీ పెరుగుతుంది.

త్రికోణాసనం(Trikonasana): ఈ ఆసనం వేయడానికి కాళ్లను దూరంగా పెట్టి నిల్చోవాలి. ఆ తర్వాత ఒక పక్కగా వంగి చేతి వేళ్లతో పాదాలను తాకాలి. అలానే ఉండి మరో చేతిని గాల్లోకి నిఠారుగా ఉంచి మన చూపును ఆకాశం వైపు ఉంచాలి. ఈ భంగిమనలో మన శరీరం ఒక త్రిభుజాకారంలా ఉంటుంది. అందుకే దీనిని త్రికోణాసనం అంటారు.

ఈ ఆసనం మనల్ని ఉత్తేజపరుస్తుంది. మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. బద్దకంగా, నీరసంగా ఉండే భావనను పటాపంచలు చేస్తుంది. మన బ్యాలెన్స్‌ను పెంచుతుంది. ఈ ఆసనాన్ని రెండు వైపులకు వేయాలని. దీని వల్ల బాడీ చాలా రిలాక్స్ అవుతుంది.

Yoga Benefits | ఈ ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా బద్దకం, నీరసం, నిస్సత్తువ సమస్యలు తగ్గకుండా వైద్యులను ఆశ్రయించడం మేలని నిపుణులు చెప్తున్నారు. శరీరంలో ఏమైనా లోపాలు ఉండటం వల్ల కానీ, ఏమైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నా కానీ ఈ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, వీటి విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read Also: చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...