గర్భిణీలకు బిగ్ అలెర్ట్..డెలివరీ తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

0
140
Photo of a pregnant woman relaxing in nature on a beautiful sunny day

పిల్లలకు జన్మనివ్వడం అనేది మహిళలు దేవుడు ఇచ్చిన ఓ వరం. గర్భం ధరించినప్పటి నుండి డెలివరి వరకు ఎన్నో రకాల సమస్యలు వారిని వేధిస్తుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే మహిళలు ప్రసవించడం అంటే పునర్జన్మ ఎత్తడంతో సమానం. అయితే డెలివరీ తరువాత కూడా అనేక సమస్యలు మహిళలను వేధిస్తుంటాయి. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

డెలివరీ తరువాత కేవలం శారీరక ఇబ్బందులే కాదు మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు చెపుతున్నారు. అయితే యోగా వల్ల శరీరానికి, మనసుకు ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. కండరాల్లో కలిగే ఒత్తిడి, ప్రసవంలో కలిగిన ఆందోళన యోగాతో దూరమవుతాయని చెబుతున్నారు. డెలివరీ తర్వాత కుంగుబాటుకు గురైన వారికి శవాసనం మంచి ఫలితాన్నిస్తుందని తెలిపారు.

తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే?

ప్రొటీన్లు, పీచు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాహారాన్ని ఎంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి. పాల ఉత్పత్తులు తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యం పెంపొందుతుంది. మసాలాలు, కెఫైన్‌, నిల్వ ఆహారాలు, ప్రాసెస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండడం మంచిది.