దేశ ప్రజలకు బిగ్ రిలీఫ్..భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు

Big relief to the people of the country..new cases of heavily reduced corona

0
94

ఇండియాలో ప్రజలకు కాస్త రిలీఫ్ దొరికినట్టే. ఎందుకంటే మన దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు కానీ ఇప్పుడు తగ్గిన్నట్టు అనిపిస్తుంది. కేవలం వేలల్లో మాత్రమే కేసులు నమోదు కావడంతో దేశ ప్రజలు ఊపిరి తీసుకుంటున్నారు.  తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖహెల్త్‌ బులిటెన్‌ ను విడుదల చేసింది. ఈ మేరకు గడిచిన 24 గంటల్లో దేశంలో 34113 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,78,882 కు చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,16,77,641 కు చేరింది.అలాగే ఇప్పటి వరకు 11,66,993 మందికి కరోనా పరీక్షలు చేసిన్నట్టు కేంద్ర  ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక నిన్న ఒక్క రోజే 346 మంది కరోనా తో మృతి చెందారు.

దీంతో ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 5,09,011 చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో.. 91930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,95,87,490 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసిన్నట్టు  కేంద్ర ఆరోగ్య శాఖ వెలువరించింది.

మొత్తం కేసులు: 4,26,65,534

మొత్తం మరణాలు: 5,09,011

యాక్టివ్ కేసులు: 4,78,882