బ్లాక్ రైస్ గురించి ఎప్పుడైనా విన్నారా – మన దేశంలో ఎక్కడ పండుతాయో తెలుసా

బ్లాక్ రైస్ గురించి ఎప్పుడైనా విన్నారా - మన దేశంలో ఎక్కడ పండుతాయో తెలుసా

0
99

బ్లాక్ రైస్ వీటిని చూస్తే ఇదేంటి అన్నం మాడిపోయిందా అని భావిస్తారు, కాని బ్లాక్ రైస్ అనేది కూడా ఉంటుంది, ఇవి చాలా మంచిది షుగర్ పేషంట్లకు.. అంతేకాదు ఇది కొన్ని రకాల వంటల కోసం వాడతారు, నేరుగా రైస్ గా అంతగా తినకపోయినా కొన్ని ఫుడ్స్ తయారు చేస్తారు..

మణిపూర్ బ్లాక్ రైస్కు అరుదైన గుర్తింపు లభించింది. చఖావో రకం బియ్యానికి జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది, ఈ రైస్ మనకు కూడా మార్కెట్లో దొరుకుతాయి ..కాని దీనిని పెద్దగా మనవాళ్లు ఇంకా అలవాటు చేసుకోలేదు.
శతాబ్దాలుగా మణిపూర్లో సాగులో ఉన్న చాఖవో అనే సువాసన గల గ్లూటినస్ వరి మంచి సువాసన కలిగి ఉంటుంది.

దీనిని ఏ వంటకం చేసినా మంచి సువాసన వస్తుంది.. ఈ విత్తనాలు కావాలి అంటే మణిపూర్ వెళ్లాల్సిందే, ఇక ప్రత్యేకమైన ఫంక్షన్లు కార్యక్రమాలలో వీటిని వాడుతూ ఉంటారు, మణిపూర్ బ్లాక్రైస్ కిలో రూ.100 నుంచి 120 మధ్య ఇంఫాల్ స్థానిక మార్కెట్లో లభిస్తుంది.హోల్ సేల్ గా మనకు కావాలి అంటే ఇంఫాల్ నుంచి తెచ్చుకోవాల్సిందే