ఉసిరిగింజలను ఉఫ్‌ అని ఊదేస్తున్నారా? అయితే ఈ ప్రయోజనాలు మిస్ అవుతున్నట్టే..

0
107

ఉసిరికాయకాయలను తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు పొందుతామని అందరికి తెలుసు. కానీ మనకు తెలియక ఉసిరిగింజలను అనవసరంగా తినకుండా పడేస్తుంటాము. కానీ ఒక్కసారి ఈలాభాలు తెలిస్తే మళ్ళీ జీవితంలో ఉసిరిగింజలను పడేయ్యరు.

అవేంటంటే..ఉసిరికాయలో బోలెడు ఔషధగుణాలు ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంపొందుతుంది. అంతేకాకుండా అనేక ఆరోగ్య సమస్యలను మన దరికి చేరకుండా కాపాడుతుంది. కేవలం ఉసిరికాయలే కాకుండా వాటి గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉసిరి గింజలు లో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

కంటిలో దురద, మంట ఇంకా అలాగే కళ్లలో ఎర్రబారడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఉసిరి గింజలను బాగా మెత్తగా నూరి కళ్లపైన ఇంకా అలాగే కింది భాగంలో రాసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ఉసిరి గింజలను ఎండబెట్టి దంచి బాగా పొడిచేసుకొని ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తొలగిపోతాయి.