మనలో చాలా మంది బొబ్బర్లని తరచూ తీసుకుంటారు. అనేక రకాల వంటకాలు చేసుకుంటారు. ఇక మంచి రుచి అనేక పోషకాలు కలిగిన నవధాన్యాల్లో ఒకటి ఈ బొబ్బర్లు. వీటిని అలసందలు అని కూడా పిలుస్తారు. వీటిని మనం ఉడికించుకుని ఉల్లిపాయ టమోటా ఇలా వేసుకుని తాళింపుతో కూడా తీసుకోవచ్చు. కొందరు రొట్టెలు వేసుకుంటారు, అలసందల కూర, గారెలు ఇలా చాలా వెరైటీలు చేసుకుంటారు.
వీటిలో చాలా తక్కువ క్యాలరీలు తక్కువ కొవ్వు ఉంటుంది . ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దక సమస్య ఉన్న వారికి ఇది చాలా మంచి ఫుడ్ . ఇవి తింటే పెద్దగా ఆకలి వేయదు, డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు కూడా ఈ బొబ్బర్లు తినవచ్చు. వీటిలో పొటాషియం మెగ్నీషియం ఉంటాయి. అలాగే జీర్ణక్రియ చాలా సాఫీగా జరుగుతుంది. కడుపు ఉబ్బరం సమస్య ఉండదు.
ముఖ్యంగా వీటిని ఏ సీజన్లో అయినా తినవచ్చు. బయట చిరు తిండ్ల కంటే ఈ బొబ్బర్లు వంద రెట్లు మేలు అంటున్నారు నిపుణులు. బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఈ బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ను తగ్గిస్తాయి. ఇక వీటిని యూత్ కూడా ఈ మధ్య బాగా తింటున్నారు. ఎదిగే పిల్లలకు కూడా ఈ ఫుడ్ అందిస్తున్నారు.