భోజనం తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు

భోజనం తిన్న తర్వాత ఈ పనులు అస్సలు చేయవద్దు

0
94

చాలా మంది ఏదైనా తిన్న తర్వాత వెంటనే వాటర్ తాగుతారు. ఇలా చేయవద్దు అని వైద్యులు చెబుతారు. భోజనం టిఫిన్ ఇలా ఏది చేస్తున్నా ఓ గంట లేదా అరగంట ముందు నీరు తీసుకోవాలి.. అంతేకాని తిన్న తర్వాత నీరు తాగడం అంత మంచిది కాదు, అయితే భోజనం చేశాక కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

 

మరి ఆ కారణాలు ఏమిటి ఆ ఇబ్బందులు ఏమిటి అనేది కూడా తెలియచేస్తున్నారు మరి ఏమిటో చూద్దాం.

1. భోజనం చేసిన అరగంట వరకూ నీరు ఎక్కువగా తీసుకోవద్దు

2. ఉదయం భోజనం అంటే ఉదయం అన్నం తినే అలవాటు , మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసిన గంట వరకూ స్నానం వద్దు… ఇలా వెంటనే స్నానం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్, కడుపులో మంట వంటివి వస్తాయి.

 

మీరు భోజనం చేసిన వెంటనే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవద్దు,

అలాగే జ్యూస్ పంచదార బెల్లం ఇలాంటి కలిపిన జ్యూస్ లు తీసుకోవద్దు

అన్నం తిన్న వెంటనే చెరకు పండ్ల రసం ఇలాంటివి తీసుకోవద్దు

భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంటుంది అది చాలా డేంజర్ అసలు పడుకోవద్దు.

అతిగా నడవకూడదు వ్యాయామం చేయకూడదు తిన్న గంట తర్వాత ఏమైనా చేసుకోవచ్చు.