శుక్రవారం నుంచి మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ | టివి స్క్రోలింగ్స్ నమ్మొద్దు

anandhaiah clarify covid medicine supply bonige anandhaiah medicine kovid medicine in ayurveda

0
130

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పేషెంట్లకు ఆయుర్వేద మందు ఇస్తూ సంచలనం సృష్టించారు నెల్లూరు జిల్లా కృష్ణ పట్నం కు చెందిన బొణిగె ఆనందయ్య. ఆయన మొదటి వేవ్ నుంచి ఇప్పటి వరకు సుమారు 80వేల మందికి మందు ఇచ్చారు. వారిలో సింగిల్ రిమార్క్ కూడా లేదన్న చర్చ ఉంది.

అయితే ఆనందయ్య మందుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగలోకి దిగాయి. ఆయన మందులో ఏం మహత్యం ఉందో వెలికితీసేందుకు పరిశోధనలు ప్రారంభించాయి. ఆనందయ్య మందును ప్రభుత్వం ఆపేయించింది. కరోనా రోగులు ఆనందయ్య మందు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఆనందయ్య హైకోర్టును కూడా ఆశ్రయించారు.

అయితే మీడియా ఛానెళ్లలో శుక్రవారం అంటే మే 28 నుంచి ఆనందయ్య మందు పంపిణీ పున: ప్రారంభిస్తున్నట్లు స్క్రోలింగ్స్ వచ్చాయి. దీంతో శుక్రవారం నుంచి మందు పంపిణీపై ఆనందయ్య ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్న సారాంశం ఏమంటే…

’’నా పేరు బొణిగె ఆనందయ్య. కృష్ణపట్నం. ఈమధ్య మందు తయారు చేయడం ఆపేశాము. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే మందు తయారు చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తాను. టివిల్లో, సోషల్ మీడియాలో శుక్రవారం నుంచి మందు ఇస్తున్నట్లు అనౌన్స్ చేస్తున్నారు. అది అంతా అబద్ధం. మీరు నమ్మొద్దు. ప్రజెంట్ నాదగ్గర మందుకు సంబంధించిన వనమూలికలు, ద్రవ్యాలు లేవు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే టివిలో అనౌన్స్ చేసి అందరికి సమాచారం ఇచ్చి మందు సప్లై చేయగలనని మనవి చేసుకుంటున్నాను‘‘.

 

ఆనందయ్య మాట్లాడిన వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.

https://www.facebook.com/watch/?v=143394377831067