అబ్బాయిలు – అమ్మాయిలు ముఖానికి ఆవిరిపడుతున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి 

-

మనకు జలుబు దగ్గు వస్తే వెంటనే ఆవిరి పడతాం, కాస్త ముక్కు రంద్రాలు ఫ్రీ అవుతాయి అని అనుకుంటాం, కాస్త రిలీఫ్ కూడా వస్తుంది, ఈ సమయంలో మన ముఖం పై చెమట ఎంత దారుణంగా వస్తుందో తెలిసిందే, అంతేకాదు ముఖం కూడా చాలా రీ ఫ్రెష్ గా అనిపిస్తుంది.. దీనికి కారణం తెలుసుకదా.. ఈ ఆవిరి వల్ల చర్మ రంథ్రాలు తెరుచుకుంటాయి. మురికిలాంటిది ఏమి ఉన్నా బయటకు వస్తుంది.
అయితే ఇటీవల రోజుల్లో చాలా మంది అమ్మాయిలు అందం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు…అంతేకాదు
ఫేషియల్ చేయించుకుంటున్నారు.. వారానికి ఓసారి బ్యూటీ పార్లర్ కు వెళుతూ ఉంటున్నారు…. ఇలా చర్మాన్ని శుభ్రపరిచే ప్రక్రియలో స్టీమింగ్ ఫేషియల్ ముఖ్యమైంది… చాలా మంది అమ్మాయిలు ఇవి ప్రతీ పది రోజులకి ఓసారి చేయించుకుంటున్నారు..
ముఖ్యంగా అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఓ విషయం గుర్తు ఉంచుకోవాలి.. అతిగా ఆవిరి పడితే ముఖం కాంతి కోల్పోతుంది, అంతేకాదు ఎక్కువగా ఇలా చేయడం వల్ల చర్మం మొద్దుబారుతుంది. నెలకి ఓసారి మాత్రమే ఇలా చేసుకోవడం మంచిది అంటున్నారు. అయితే ఇలా ఎంతసేపు చేసుకోవాలి అంటే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఇలా ఆవిరిపట్టాలి అనేది మర్చిపోకండి .. ఇలా 5 నిమిషాలు ఆవిరిపట్టడం వల్ల  వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. ఎక్స్ పర్ట్ లతోనే చేయించుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...