కరోనా కేసులకు బ్రేక్..గత 24 గంటల్లో ఎన్ని నమోదయ్యాయంటే..?

0
75

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు కేసుల సంఖ్య నమోదవడం కలకలం రేపింది. కాగా గడిచిన 24 గంటల్లో (సోమవారం) భారీగా నమోదవుతున్న కేసులకు కాస్త బ్రేక్ పడింది. దీనితో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,38,018 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు.. ఈ మహమ్మారి నిన్న 310 మంది ప్రాణాలు బలి తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా ప్రస్తుతం దేశంలో 17,36,628 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,54,947,882 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94 శాతంగా ఉంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోల్చుకుంటే.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8.31 శాతం పెరిగింది.

https://twitter.com/ANI?