Breaking- ఏపీలో ఒమిక్రాన్‌ టెన్షన్..మరో రెండు కొత్త కేసులు నమోదు

Breaking- Omikran‌ Tension in AP..Two new cases registered

0
278

ప్రపంచంలో ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకు గణనీయంగా విస్తరిస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదు అయ్యాయి.

దీనితో ఏపీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ మీదుగా ప్రకాశం జిల్లాకు వచ్చిన 48 ఏళ్ల వ్యక్తికి, యూకే నుంచి అనంతపురం వచ్చిన మరో వ్యక్తికి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు ఈ ఒమిక్రాన్ కొత్త వేరియంట్ డెల్టా వేరియంట్ తో పోలిస్తే 5 రేట్లు వేగంగా విస్తరిస్తుంది. ఈ వైరస్ కేవలం 1-3 రోజుల్లోనే డబుల్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం. అయితే ఇప్పటివరకు మనదేశంలో డెల్టా వేరియంట్ డామినెంట్ గా ఉంది. ఒమిక్రాన్ డామినెంట్ వేరియంట్ గా మారలేదు. అందుకే దీనిని శాస్త్రవేత్తలు డెల్మిక్రాన్ వేరియంట్ అంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో డెల్టా వేరియంట్ ఉంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఉంది.