Brinjal | వీరికి వంకాయ విషంతో సమానం..

-

కూరగాయల రారాజుగా చెప్పే వంకాయ(Brinjal) అంటే చాలా మందికి అమితమైన ఇష్టం ఉంటుంది. కొంతమందికి అప్పటి వరకు లేని ఆకలి కూడా వంకాయ కర్రీ అంటే చాలు పుట్టుకొచ్చేస్తుంది. ఈ వంకాయ కూర ఎంత స్పెషల్ అంటే.. వీటిపై చాలా పాటలే ఉన్నాయి. కొందరైతే నాన్ వెజ్ కన్నా వంకాయ కూర చాలా బెస్ట్ అని అంటారు. వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు కూడా ఉన్నాయి. స్నాక్స్‌గా కూడా వంకాయను చేసుకుంటారు.

- Advertisement -

వంకాయ ఇంత ఫేమస్ ఇప్పుడు అవడం కాదు.. ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి కూడా కూరగాయల్లో వంకాయ చాలా స్పెషల్‌గా ఉంది. అందుకే చాలా మంది అక్బర్ వంటి మహా చక్రవర్తులు కూడా వంకాయను కూరగాయల రారాజు అని కీర్తించారు. అయితే వంకాయ కేవలం నోటి రుచికే కాదు పోషకాలకు కూడా పేరొందింది. వంకాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

వంకాయ(Brinjal)లో ఫైబర్, పొటాషియం, యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి గుండెకు మేలు చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా వంకాయ భేషుగ్గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి కూడా వంకాయ ఎంతో ఉపయోగపడుతుంది. కానీ కొంతమందికి మాత్రం ఈ వంకాయ విషంతో సమానమని వైద్య నిపుణులు అంటున్నారు. వారి ఈ వంకాయను పొరపాటున తిన్నా సరే.. నానా అవస్థలు పడాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ వంకాయను ఎవరు తినకూడదో చూద్దామా..

స్కిన్ అలెర్జీ: చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు చెప్తున్నారు. ఒకవేళ వీరు తప్పిదాలి పొరపాటున వంకాయ తింటే దద్దుర్లు, దురదలు, మంట, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ సమస్యలు ఉన్నవారు వంకాయలను తినకుండా ఉండాలి. చర్మ సంబంధిత సమస్య నయమైన తర్వాత కొన్నిరోజుల పాటు వంకాయకు దూరంగా ఉండాలని, ఆ తర్వాత వంకాయను తినొచ్చని, కానీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్లు: ఈ సమస్య ప్రస్తుత కాలంలో చాలా మందిలో ఉంటుంది. వారు వంకాయకు దూరంగా ఉండటం కాదు.. వీలైతే అసలు మానేయాలని వైద్యులు చెప్తున్నారు. వంకాయలో ఆక్సలేట్ స్థాయిలు అధికంగా ఉంటాయి. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. అందుకే కిడ్నీలో రాళ్ల సమస్యతో ఇబ్బంది పడే వారికి వంకాయ అనేది విషంతో సమానంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి: ప్రస్తుత పరుగుల ప్రపంచంలో ఒత్తిడి అనేది చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. ఈ ఒత్తిడితో పోరాడే వారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా డిప్రెషన్‌కు మందులు వినియోగించేవారు వంకాయను మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

వారు వంకాయ తింటే వారు వేసుకునే ఔషధాలతో వంకాయలోని రసాయనాలు రసాయనిక చర్యలు జరిపే అవకాశం ఉందని, దీని వల్ల ఒత్తిడి సమస్య మరింత అధికం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డ్రిప్రెషన్ మందులు వినియోగించేవారు వంకాయను ఆ మందులను ఆపేసేవరకు దూరంగా ఉండాల్సిందేనని చెప్తున్నారు నిపుణులు.

కంటి సమస్యలు: శుక్లం, కంటి దురద, మంట, వాపు వంటి సమస్యలు ఉన్న వారికి కూడా వంకాయ విషంలా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. వంకాయ తింటే వీరికి సమస్య మరింత తీవ్రంగా మారుతుందని చెప్తున్నారు. వీరు వంకాయ తినాలనుకుంటే తప్పకుండా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వంకాయ జోలికి వెళ్లాలని సూచిస్తున్నారు నిపుణులు.

రక్తహీనత(Anemia): ఈ సమస్య ఉన్న వారు కూడా వంకాయను తినకూడదు. రక్తం ఉత్పత్తి కోసం మందులు తీసుకునే వారు వంకాయను అస్సలు తినకూడదు. దీనిని తింటే ఇది ఆ మందులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, రక్తం ఉత్పత్తి నెమ్మదించేలా చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

దీని వల్ల మందులు వికటించే సమస్యలు కూడా ఉన్నాయని, అదే జరిగితే ఆ పరిణామాలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్లే రక్తహీనత మందులు వినియోగించేవారు వంకాయకు దూరం పాటించాలని చెప్తున్నారు.

ఎసిడిటీ(Acidity): అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు వంకాయ తింటే ఈ ఇబ్బందులు అధికమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు. వంకాయలో ఉండే అధికశాతం ఫైబర్.. కడుపునొప్పి, గ్యాస్ సమస్యలను అధికం చేస్తుంది. అందుకే జీర్ణ ప్రక్రియ సంబంధిత సమస్యలు ఉన్నవారు వంకాయలు(Brinjal) తినకూడదని వైద్యులు చెప్తున్నారు.

Read Also: గుడ్డు తినడం మంచిదే.. కానీ ఎలా, ఎప్పుడు తినాలో తెలుసా..?
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...