బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి..ప్రతి 50 మందిలో ఒకరికి..

Britain suffocated..for every one in 50 people

0
113

బ్రిటన్ మరోసారి కరోనా వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ దేశంలో మళ్లీ జనవరి నాటి ఉద్ధృతి కనిపిస్తోంది. నిత్యం సుమారు 40 వేల కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్టోబర్ 22తో ముగిసిన వారంలో ప్రతి 50 మందిలో ఒకరికి వైరస్ సోకిందని ఆఫీస్‌ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్‌ వెల్లడించింది. అంతకు ముందువారం 55 మందిలో ఒకరికి వైరస్ వ్యాప్తి చెందినట్లు తెలిపింది.

ఇదే ఏడాది జనవరిలో బ్రిటన్‌లో కరోనా గరిష్ఠ స్థాయికి చేరింది. జనవరి రెండుతో ముగిసిన వారంలో కూడా ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మూడోసారి లాక్‌డౌన్ విధించింది. మరోపక్క కరోనా టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.

ఫలితంగా కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరికలు, మరణాలు అదుపులో ఉన్నట్లు వెల్లడైంది. ప్రస్తుత ఉద్ధృతిలో పది రోజుల కిందట 50 వేలకు చేరిన కొత్త కేసులు.. తాజాగా 43 వేలకు పడిపోయాయి. 186 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా.. ఆర్థికవ్యవస్థ పురోగమనం కోసం ప్రయత్నాలు చేస్తోన్న ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ సారి లాక్‌డౌన్ పెట్టే యోచన రానివ్వడం లేదు.