మన దేశంలో ..టీ.. కి చాలా మంది లవర్స్ ఉన్నారు, అయితే చాలా రకాల ప్లేవర్ టీలు చూశాం.. కాని ఇక్కడ ఓ వింత టీ వైరల్ అవుతోంది, అసలు ఇలాంటి టీ ఉంటుందా అని అంటున్నారు అందరూ.. ఈ టీని ఎప్పుడూ వినలేదు చూడలేదు తాగలేదు అంటున్నారు…మరి ఆ టీ ఏమిటి దాని స్పెషల్ ఏమిటి చూద్దాం.
ఆగ్రాలోని బాబా స్టాల్లో ఓ వ్యక్తి టీ తయారు చేశాడు. అక్కడ టీ మరుగుతోంది అందులో ఏం వేశాడో తెలుసా బటర్.. ఇదేమిటి బటర్ వేయడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా… టీలో బటర్ వేసి అందరిని ఆలోచింప చేశాడు..బటర్ వెన్నవేశాడు. అదంతా కరిగిపోయిన తర్వాత ఆ టీపొడి వడగట్టి బయటపడేశాడు..
ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇదేమిటి అని చాలా మంది ఆశర్యపోతున్నారు. అయితే వైద్యులు చెబుతున్నది ఒకటే.. ఇది అందరికి సెట్ కాదు.. కొందరికి దీని వల్ల వికారం వాంతులు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు డాక్టర్ అలోక్ వర్మ.. సో ఇదేం ఆలోచన బాబు అని కామెంట్లు పెడుతున్నారు అందరూ.
ఈ బటర్ టీ వీడియో మీరు చూడండి
https://www.instagram.com/p/CJpf8iZl-Y5/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again