భోజనం సమయంలో నీరు తాగొచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారంటే?

0
119

ఆహారం చేసేటప్పుడు చాలా మంది నీరు తాగుతుంటారు. మరింకొంతమంది భోజనానికి ముందు గాని భోజనానికి తరువాత గాని నీళ్లు తాగుతుంటారు. అయితే భోజనానికి ముందు నీళ్లు తాగాలా? భోజనం చేసేటప్పుడు తాగాలా? లేక భోజనం చేశాక నీళ్లు తాగాలా? అనేది తెలియక సతమతమవుతుంటారు. మరి ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం చేస్తూ నీరు తాగకూడదని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి ముందు, భోజన సమయంలో, భోజనానికి తరువాత నీళ్లు తీసుకోవచ్చు అంటున్నారు. మామూలుగానే మనం తీసుకునే ఆహారంలో, కూరగాయల్లో నీరు ఉంటుంది. అంతెందుకు మనం తినే సమయంలో లాలాజలం కూడా వస్తుంది అది కూడా నీరే. మరి వాటి వల్ల నష్టం చేకూరనప్పుడు నీళ్లు తాగడం వల్ల కూడా ఎలాంటి అనర్ధం జరగదని అంటున్నారు.

అయితే భోజనం చేశాక చాలా సమయం నీరు తాగకుండా ఉండకూడదని చేబుతున్నారు. దీనివల్ల డీహైడ్రేషన్ కు గురవుతారు. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్ల సమయం బాధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు.