చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవచ్చా..ఇందులో నిజమెంత?

0
126

ప్రెగ్నెన్సీ కిట్ లేకుండా ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా చెక్కరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది నిజం అనుకుని చాలామంది ప్రయత్నిస్తున్నారు కూడా..ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కచ్చితమైన ఫలితాలను ఇస్తుందా.. ఇందులో నిజం ఎంతుంది.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో కొద్దిగా చక్కెరను తీసుకోవాలట. అందులో ఉదయం మొదటి సారిగా వెళ్లే యూరిన్‌ చుక్కలు వేయాలి. కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత చక్కెరలో ఏదైనా మార్పు జరిగిందా అనేది గమనించండి. మూత్రంలో hCG ఉంటే సాధారణంగా చక్కెర కరిగిపోదు. అది ప్రెగ్నెన్సీ సంకేతంగా చెబుతున్నారు. వైద్య నిపుణులు మాత్రం ఈ టెస్ట్ ను కొట్టిపారేశారు. ఎందుకంటే మహిళ యూరిన్‌లో చక్కెర కరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయట. ఈ పరిస్థితులలో ఇలాంటి చిట్కాపై ఆధారపడటం వందశాతం తప్పేనని చెబుతున్నారు. మరోవైపు ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

మీరు ప్రెగ్నెన్సీ లక్షణాలను ఎదుర్కొంటుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్‌తో చెక్ చేసుకోవడమే ఉత్తమైన పని.. గర్భం ధృవీకరించబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ. ఇలాంటివి చేసి ఒక నిర్ణయానికి రావడం ఏమాత్రం కరెక్టు కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఇలాంటి ఆధారాలు లేని చిట్కాలను గుడ్డిగా నమ్ముతుంటే..వారికి విషయం చెప్పండి. చెక్కరే కాదు..ఇంకా ఏవేవో టిప్స్ సోషల్ మీడియాలో చెప్తుంటారు.. అన్ని అందరికి ఒకటే రిజల్ట్ ఇస్తుందని లేదు.. ముఖ్యంగా వైద్యపరంగా ధృవీకరించని వాటిని ఇంత ముఖ్యమైన విషయంలో నమ్మకపోవడమే మంచిది.