హైబీపీ ఉంటే పెరుగు తినొచ్చా? షాకింగ్ విషయాలు..

Can I have yogurt if I have high blood pressure? Shocking things to light

0
102

ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవన శైలీ కారణంగా అనేక మంది రక్తపోటు సమస్యలతో బాధపడుతున్నారు. 2020 సంవత్సరంలో దాదాపు 15 శాతం మందికి హైబీపీ ఉన్నట్లు తేలింది. ఒక నివేదిక ప్రకారం గత 4 సంవత్సరాలలో అధిక బీపీ రోగులు మరింత పెరిగారు.

దాదాపు 35 శాతం మంది కుటుంబంలో ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే వీరు ప్రతిరోజూ ఆహారంలో పెరుగు తీసుకుంటే హైబీపీ సమస్యను నియంత్రింవచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో తెలీంది.

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మైనే శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిశోధంచారు. ఇందులో రక్తపోటు, గుండె సంబంధిత ప్రమాదకారకారలపై పెరుగు ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఇందులో అధిక బీపీ ఉన్నవారిలో రోజూ వారీ పెరుగు వినియోగం బీపీని తగ్గించడంలో సహయపడుతుందని నిపుణులు తెలిపారు.

పాల ఆహారం పెరుగు బీపీని తగ్గిస్తుందని.. పాల ఉత్పత్తులలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక సూక్షపోషకాలు ఉంటాయి. ఇవి బీపీని నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తపోటును తగ్గించే బ్యాక్టీరియా కూడా పెరుగుతుందని పెరుగు మరింత ప్రభావవంతంగా ఉంటుందని తెలీంది. పెరుగు క్రమం తప్పకుండా తీసుకునే వారిలో రక్తపోటు..పెరుగు తినని వారి కంటే 7 పాయింట్లు తక్కువగా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది.