సెల్‌ఫోన్‌ వాడితే బ్రెయిన్‌ ట్యూమర్‌?

-

సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత కొన్ని పుకార్లు కూడా నిజం అనేంతగా నమ్మేస్తున్నారు ప్రజలు. దీనివల్ల దేన్ని నమ్మాలో, దేన్ని నమ్మకూడదో అనే సందిగ్ధంలో పడిపోతున్నారు. సెల్‌ఫోన్‌ వాడితే బ్రెయిన్‌ ట్యూమర్‌ వస్తోందంటూ ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ప్రజలు ఫోన్లు వాడటానికి, పిల్లలకు ఇవ్వటానికి బెంబేలెత్తిపోతున్నారు. అసలు నిజంగా సెల్‌ ఫోన్‌ వాడితే బ్రెయిన్‌ ట్యూమర్లు వస్తాయా అని నిపుణులను ప్రశ్నిస్తే.. అందుకు తగ్గ ఆధారాలు లేవని చెప్తున్నారు. సెల్‌ఫోన్‌ రేడియేషన్‌ బహుశా క్యాన్సర్‌ కారకం అని 2011లో ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ సంస్థ వెల్లడించింది.

- Advertisement -

సెల్‌ఫోన్‌ వాడకంతో బ్రెయిన్‌ క్యాన్సర్‌ వస్తుందన్న దానిపై పరిశోధనలు చేయటానికి ఎన్నో సవాళ్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయినప్పటికీ కొన్ని అధ్యయనాలు జరిగాయనీ, వాటిల్లో ముఖ్యమైనవి డానిష్‌ రీసెర్చ్‌, కోహోర్ట్‌ స్టడీ, మిలియన్‌ ఉమెన్స్‌ స్టడీ వాళ్లు చేసినవి ముఖ్యమైనవని నిపుణులు తెలిపారు. ఈ అధ్యయనాలు సెల్‌ఫోన్‌ రేడియేన్‌ బ్రెయిన్‌ ట్యూమర్‌కు కారణం అవుతాయని ఎటువంటి ఆధారాలు చూపలేకపోయాయని పరిశోధకులు తెలిపారు. అతి ఏదైనా ప్రమాదమేననీ.. సెల్‌ ఫోన్‌ అవసరం మేరకే వాడాలి తప్పా.. గంటల తరబడి దానితోనే ఉండటం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...