వర్షాకాలంలో అరటిపండు తినొచ్చా? లేదా? అని సందేహపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే..

0
87

అరటిపండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు కూడా మనకు అరటిపండు నుండి లభించడం వల్ల వైద్యులు మనకు ఏ చిన్న సమస్య వచ్చిన అరటిపండ్లు తీసుకోమని సూచిస్తుంటారు. కానీ వర్షాకాలంలో అరటిపండు తింటే ఏమవుతుందో అని కొందరు సందేహపడుతుంటారు.

ఏ సీజన్లో అయినా సరే విరివిగా లభించడమే కాకుండా తక్కువ ధరకు లభించే అరటి పండ్ల ను తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అరటిపండును ఏ కాలంలో అయినా సరే తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాన కాలంలోఅరటి పండ్లను తినడం వల్ల ఈ పండులో లభించే విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, అమైనో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి.

ఇవన్నీ కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అంతేకాకుండా దగ్గు, ఆస్తమా, అజీర్తి వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానీ అరటిపండ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అలా తింటే జలుబు, దగ్గు చేయవచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి సమయంలో వీటిని నివారించండి.