సిగరెట్ తాగడం మానలేకపోతున్నారా? అయితే ఒక్కసారి ఇలా చేసి..

0
120

ప్రస్తుతం స్మోకింగ్ ఓ అలవాటుగా మారిపోయింది.. చాలా మంది ప్రజలు సరదాగా స్మోకింగ్ మొదలెట్టి, ఆ తర్వాత తమకు తెలియకుండానే వ్యసనపరులుగా మారుతున్నారు. స్మోకింగ్ బారిన పడి లక్షల మంది తమ ప్రాణాలకే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. అయితే అలవాటుగా మారిన స్మోకింగ్ మానేయాలంటే వారి వల్ల కాక నానా తంటాలు పడుతున్నారు. ధూమపానానికి కళ్లెం వేసి వదిలించుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి.

సిగరెట్టు, చుట్ట, బీడీలలో ఉండే నికోటిన్ స్మోకింగ్ చేసే వారి మనసును బాగా లాగేస్తుంది. అందుకే ఎంత కంట్రోల్ చేసుకున్నా మళ్లీ మళ్లీ పొగ తాగాలానే కోరిక అలాగే ఉంటుంది.

సిగరెట్ మానేయడం అంత సులువు కాదు. ఈ ప్రక్రియ మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా అనిపిస్తాయి.

మీకు ఇష్టమైన వారి సాయంతో ఈ చెడు అలవాటుకు అడ్డుకట్ట వేయచ్చు. వారి ప్రేమ మిమ్మల్ని ధూమపానానికి దూరంగా చేస్తుంది. సిగరెట్ తాగాలనిపించినప్పుడల్లా మీ పిల్లలు లేదా తల్లి, భార్యతో కాసేపు గడపండి.

ఎంత ప్రయత్నించినా ధూమపానం మానడం మీ వల్ల కాకపోతే వైద్యుల సలహా తీసుకోండి. నికోటిన్ ప్యాచ్‌లు ఈ విషయంలో ఉపయోగపడతాయి.