కరోనా అప్డేట్: తగ్గిన కేసులు..పాజిటివిటీ రేటు ఎంతంటే?

0
96

భారత్​లో కొవిడ్​ కేసులు క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జరిపిన 14,48,513 పరీక్షల్లో 1,07,474 కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 865 మంది మరణించారు. 2,13,246 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,21,88,138 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 12,25,011 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 96.90 శాతంగా ఉంది.  ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,69,46,26,697 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

మొత్తం మరణాలు: 5,01,979

యాక్టివ్ కేసులు: 12,25,011

మొత్తం కోలుకున్నవారు: 4,04,61,148