ఢిల్లీ: రకరకాల వేరియంట్లతో కరోనా విజృంభిస్తూనే ఉంది. దశల వారీగా ప్రజలపై విరుచుకుపడుతుంది. దాంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇంకాస్త ముమ్మరం చేశారు. ఈ క్రమంలో 18 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వాక్సిన్ బూస్టర్ డోస్ అందించాలని కేంద్రం భావిస్తుంది. ఈ నెల 10 నుంచి ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నట్టు వెల్లడించింది.