కరోనా కేసుల విషయంలో ఆ 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక

Central warning to those 8 states for corona cases

0
93

దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఎంతలా కేసులు పెరిగాయో చూశాం. అయితే ఇప్పుడు అన్నీ చోట్ల అన్ లాక్ ప్రక్రియ జరిగింది. ఇక కొన్ని స్టేట్స్ లో ఇంకా ఆంక్షలు ఉన్నాయి. ఈ సమయంలో కొన్ని చోట్ల కేసులు తగ్గుతున్నాయి, మరికొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా 8 రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఒక వైపు పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇంతకాలం కొన్నివ్యాపారాలు మూతబడ్డాయి. ఇక అన్ లాక్ ప్రక్రియతో జనం ఇప్పుడు మళ్లీ అన్నీ చోట్ల గుంపులుగా ఉంటున్నారు. ఈ సమయంలో కొన్ని చోట్ల కేసులు మాత్రం పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు చూస్తుంటే ఆందోళనకరంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసింది.

కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. ప్రతీ రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని. అలాగే ప్రతీ ఒక్కరు కరోనా నిబంధనల్ని పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, కేరళ, మేఘాలయ, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలిపింది.