పుదీనాతో ఎలాంటి జుట్టు సమస్యలకైనా ఇట్టే చెక్..

0
132

అందంగా కనబడాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందంగా పెంచడంలో కేవలం చర్మసౌందర్యమే కాకుండా జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతకాలంలో చాలా మంది వివిధ రకాల జుట్టు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌డానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

అంతేకాకుండా మార్కెట్ లో దొరికే అన్నిర‌కాల తైలాల‌ను, షాంపూల‌ను ఉప‌యోగిస్తూ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా మనందరం వంటింట్లో ఉప‌యోగించే పుదీనాతో ఎలాంటి జుట్టు సమస్యలకైనా ఇట్టే చెక్ పెట్టవచ్చు. మ‌న జుట్టుకు కావ‌ల్సిన బ‌లాన్ని, మంచి రంగును ఇవ్వ‌డంలో పుదీనా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

పుదీనా ఆకులనే కాకుండా పుదీనా తైలాన్ని ఉప‌యోగించి కూడా మ‌న జుట్టును ఆరోగ్యంగా, దృడంగా ఉంచుకోవచ్చు. పుదీనా ఆకులు యాంటీ ఫంగ‌ల్, యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉండడం వల్ల త‌ల‌లో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పుదీనా ఆకుల‌ను పేస్ట్ గా చేసి త‌ల‌కు పట్టించి రెండు గంట‌ల త‌రువాత త‌ల‌స్నానం చేయడం వల్ల అన్ని జుట్టు సమస్యలు తొలగిపోతాయి.