దంతా సమస్యలకు సహజపద్ధతిలో చెక్ పెట్టండిలా?

0
94

మారుతున్న జీవనవిధానంతో ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దంతాల స‌మ‌స్యతో బాధపడేవారు సంఖ్య అధికం అవుతుంది. ఈ సమస్య నుండి బయటపడడానికి అధికంగా డబ్బులు ఖర్చు చేసి డెంటిస్ట్ ల దగ్గరికి వెళతారు. కానీ వాళ్ళు ఇచ్చే మందులు వాడడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కావున ఎలాంటి ఖర్చు లేకుండా సహజపద్ధతిలో ఈ సింపుల్ చిట్కాను పాటించి సమస్యలను తొలగించుకోండిలా..

సాధారణంగా మనందరి ఇళ్లల్లో దొరికే జమ ఆకుతో ఈ సమస్య నుండి బయపపడొచ్చు. ముందుగా 5 లేదా 6 జామ చెట్టు ఆకుల‌ను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని పోసి అందులో జామ ఆకుల‌ను వేసి ఒక గ్లాసు నీళ్లు అయ్యే వ‌ర‌కు మ‌రిగించి వ‌డ‌క‌ట్టాలి. ఈ నీరు చ‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు ఉంచి అందులో రాళ్ల ఉప్పును వేసి ఉప్పు క‌రిగే వ‌ర‌కు బాగా క‌లపాలి.

ఇలా క‌లిపిన నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు లేదా నాలుగు సార్లు చేయ‌డం వ‌ల్ల పంటి నొప్పులు, పిప్పి ప‌ళ్ల వ‌ల్ల క‌లిగే నొప్పులు తగ్గడంతో పాటు దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా కూడా తయారవుతాయి. అందుకే వేల‌కు వేలు ఖ‌ర్చు చేసి చికిత్స తీసుకునే బ‌దులు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాను పాటిస్తే దంతాల నొప్పి స‌మ‌స్యను తగ్గించుకోవడం మంచిది కదా!