వెల్లుల్లి పొట్టుతో తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోండిలా..

0
98

ఈ మధ్యకాలంలో చాలామందికి పనిభారం, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడం పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. కానీ మనందరికీ తెలియని ఈ సింపుల్ చిట్కాతో ఈ సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందొచ్చు. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

వెల్లుల్లి పొట్టును ఒక గిన్నెలో వేసి పుర్తిగా నల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఆ తరువాత ఈ పొట్టును  ఒక జార్ లో వేసి మెత్త‌ని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిలో కొబ్బ‌రి నూనెను కానీ, ఆముదాన్ని కానీ వేసి క‌లిపి త‌ల‌కు బాగా ప‌ట్టించి గంట సేప‌టి త‌రువాత త‌ల‌స్నానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం జుట్టు సమస్యలను తొలగించడమే కాకుండా వెల్లుల్లిని తరచు వంటల్లో వేసుకోవడం వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో, బీపీని నియంత్రించ‌డంలో కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.