అలోవెరాతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా?

0
132

అలోవెరా వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే కేవలం ఆరోగ్యపరంగా మేలు చేయడమే కాకుండా..చర్మసౌందర్యాన్ని, జుట్టుసమస్యలకు కూడా చెక్ పెడుతుంది. అంతేకాకుండా ఈ మొక్క ఇంట్లో ఉంటే వాస్తు దోషాలను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా కలబంద వలన కలిగే లాభాలు ఇప్పుడు చూద్దాం..

కలబందలో గ్లిసరిన్, సోడియం పామ్ కెమేలేట్, సార్బిటోల్, సోడియం పామాల్, సోడియం కార్బోనేట్  వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరిచి కాంతివంతంగా ఉంచేందుకు సహాయపడడంతో పాటు..జుట్టుకు కూడా ఈ పోషకాలు మేలు చేస్తాయి.

ముఖ్యంగా తల బాగా దురద పెడుతున్నా వాళ్ళు కలబందను ట్రై చేయడం వల్ల ఈ సమస్య దూరమయిపోతుంది. ఇంకా చుండ్రు ఉపశమనం కోసం అలోవెరా జెల్‌ను అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. దాని వల్ల ఫంగల్ పెరుగుదల తగ్గి, చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.