చెమట దుర్వాసన సమస్య వేధిస్తోంది ఇలా చేయండి సమస్య దూరం

చెమట దుర్వాసన సమస్య వేధిస్తోంది ఇలా చేయండి సమస్య దూరం

0
106

చాలా మంది చూడటానికి చాలా అందంగా ఉంటారు.. కాని వారి శరీరం నుంచి చేయి పైకి ఎత్తితే చాలు తట్టుకోలేని వాసన వస్తుంది.. దీంతో వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, వేసవి కాలమే కాదు ఇలాంటి సమస్య మూడు కాలాల్లో ఉంటుంది, ఇంకా చెమట అధికంగా పడుతూ వాసన దారుణంగా వస్తుంది, దీని వల్ల వారికి ఎంతో ఇబ్బంది నలుగురిలో ఉండలేరు.

చెమట కారణంగా వచ్చే దుర్వాసన పక్కన వారిని కూడా ఇబ్బంది పెడుతుంది, తగ్గడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. మరి అవి ఏమిటో చూద్దాం, వీటి ద్వారా చెమట దుర్వాసన తగ్గే అవకాశం ఉంది, ముఖ్యంగా అధిక చెమట సమస్య ఉంటే మసాలా కూరలు, ఫ్రైలు జంక్ ఫుడ్ డ్రింకులు మానెయ్యండి, గ్యాస్ ఐటెమ్స్ అసలు తినవద్దు.

ఇక మీరు ఎప్పటికప్పుడు టిష్యూ పేపర్ తో కుదిరితే తుడుచుకోండి చెమటని, అలాగే మీరు స్నానం చేసే సమయంలో నిమ్మకాయ రసం ఆ వాటర్ తో పిండండి…యాంటీబ్యాక్టీరియల్ సోపు ని వాడుతూ ఉండాలి.. బాగా వాసన వచ్చే పౌడర్ మాయిశ్చరైజర్ వంటి వాడకాన్ని మానెయ్యండి, వీటి వల్ల మరింత చెమట పడుతుంది..గ్రీన్ టీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.. స్నానం చేసే నీటిలో గ్రీన్ టీ వేసుకుని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఫేస్ ఫౌడర్ లాంటివి చెమట పట్టే గజ్జలు శంకల్లో రాయకండి, వీటి వల్ల రాషెస్ చెమట అధికంగా ఉంటుంది.