సమ్మర్ వచ్చింది అంటే చాలు చాలా వేడిగా ఉంటుంది.. అంతేకాదు ఈ సమయంలో చెమట సమస్య ఎక్కువ.. అంతేకాదు చెమట కాయలు వేధిస్తాయి.. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ ఇబ్బంది పెడతాయి, గుల్లల్లా చాలా మందికి వస్తాయి… మరికొందరికి ఎర్రటి దద్దుర్లుగా వస్తాయి.ఎక్కువగా ముఖం, మెడ, ఛాతీ, తొడలపై చెమటకాయలు ఎక్కువగా వస్తాయి.
ముఖ్యంగా ఈ చెమట వల్ల వచ్చే బ్యాక్టిరీయా డెడ్ స్కిన్ సెల్స్ చెమట గ్రంధులు మూసేస్తాయి.. దీంతో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.. శరీరాన్ని చల్లగా ఉంచడం వల్ల ఈ సమస్య దూరమవుతుంది. ముఖ్యంగా కాటన్ బట్టలు వేసుకోవడం మంచిది, అంతేకాదు ఎక్కువగా పలుచగా ఉన్న దుస్తులు వాడండి, ఇక సిల్క్ దుస్తులు వాడవద్దు..సింథటిక్ దుస్తులను వేసుకోకుండా కేవలం కాటన్ దుస్తులను మాత్రమే వేసుకోవాలి.
ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోండి, నిమ్మరసం మజ్జిగ తీసుకోండి రోజుకి రెండు సార్లు తీసుకుంటే శరీరం చలువ చేస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ తినండి చెమట పొక్కులు రావు వచ్చినా తగ్గుతాయి… ఇక మీరు వేపుళ్లు మసాలా అతి కారం ఇలాంటివి తినవద్దు.. నూనె ఐటెమ్స్ స్వీట్లకు దూరంగా ఉండాలి…చెమటకాయలు ఉన్నచోట పెరుగును అప్లై చేసి పదిహేను నిమిషాలు ఉంచితే చల్లని నీరుతో తర్వాత కడిగితే సమస్య తగ్గుతుంది.