చెమట కాయలతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి.

చెమట కాయలతో ఇబ్బంది పడుతున్నారా ఇలా చేయండి.

0
114

శరీరానికి చెమట ఎక్కువగా పడితే కచ్చితంగా వారి బాడీపై చెమట కాయలు లాంటివి వస్తాయి, వీటి వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది, శరీరంపై రాషెస్ కూడా దారుణంగా వస్తాయి.. వీలైనంత వరకూ చెమట పడ్డకుండా చల్లటి వాతావరణంలో ఉండేందుకు ప్రయత్నించండి. ఈ వేసవిలో రోజూ చన్నీటి స్నానమే చేయండి. రోజుకు మూడు, నాలుగు సార్లు స్నానం చేసినా పర్వాలేదు. ఎక్కువ నాలుగు ఐదు రకాల సోప్స్ కాకుండా ఒకటి కంపెనీ సోప్ వాడండి.

మీరు బయటకు వెళ్లి ఎండ నుంచి వచ్చిన వెంటనే స్నానం చేస్తే.. చెమట కాయలు వచ్చే అవకాశం ఉంది. ఇక సబ్బుబాగా తక్కువ వాడండి వీలైనంత వరకూ స్నానం ఎక్కువ నీటితో చేయండి. ఇక పిల్లలను ఎండలో ఆడనివ్వకండి, కాటన్ వస్త్రాలు వేస్తే చెమట పీల్చుకుంటుంది, రాషెస్ రావు, అలాగ నల్లటి దుస్తులు ధరించకండి.

చెమట పట్టడం వల్ల శరీరంలో నీరు తగ్గిపోతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి. ఉక్కపోత లేకుండా చూసుకోండి, కాటన్ వస్త్రాలని బాగా ధరించండి, బయటకు వెళ్లేప్పుడు సన్స్క్రీన్ లోషన్లు రాసుకోండి…కలబంద గుజ్జును చెమట కాయలపై రాస్తే సమస్య తగ్గుతుంది. ఇవి ఎక్కువగా ఉంటే మంట తగ్గకపోతే వైద్యుడ్ని సంప్రదించండి. ఇష్టం వచ్చిన లేపనాలు క్రీములు రాయద్దు,పౌడర్లు అధికంగా వాడద్దు.