క‌రోనా టీకా విష‌యంలో చైనా ప్ర‌పంచంలోనే స‌రికొత్త రికార్డ్

China sets world record for corona vaccine

0
131

చైనా నుంచి ఈ క‌రోనా మ‌హామ్మారి ఎంత‌లా విజృంభించిందో తెలిసిందే. ప్ర‌పంచం అంతా పాకేసింది. అయితే ఈ క‌రోనా విష‌యంలో ప్ర‌పంచంలో అన్నీ దేశాలు ఇబ్బంది ప‌డ్డాయి, ఏడాది త‌ర్వాత ఈ క‌రోనాకి టీకాలు వ‌చ్చాయి, ఇక చైనా కాస్త అంద‌రి కంటే ముందుగానే కోలుకుంది. ఇక దేశంలో ప్ర‌తీ ఒక్క‌రికి వ్యాక్సినేష‌న్ చేప‌ట్టింది.

తాజాగా చైనాలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వెల్లువెత్తింది. తమ దేశ ప్రజలకు 100 కోట్ల డోసుల కు పైగా టీకామందులు ఇచ్చి ప్రపంచంలోనే అతి పెద్ద ఇనాక్యులేషన్ కార్యక్రమాన్నిచేప‌ట్టింది డ్రాగ‌న్ కంట్రీ.
ఈ నెల 19 నాటికి చైనా 100 కోట్ల డోసులు వేసింది.

ప్రజల్లో ఎంతమంది రెండు డోసులు తీసుకున్నారో, ఎంతమంది ఒకే డోసు తీసుకున్నారో తెలియలేదు.
దాదాపు స‌గం జ‌నాభాకి చైనా ఇప్ప‌టికే టీకాలు ఇచ్చింది. ఇక 100 కోట్ల‌లో దాదాపు 20 శాతం రెండోడోసు కూడా తీసుకుని ఉండ‌వ‌చ్చు అని నిపుణుల అంచ‌నా. ఇటీవ‌ల మ‌ళ్లీ అక్క‌డ కేసులు పెర‌గ‌డంతో వేగంగా అక్క‌డ వాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్టారు.