చాలా మంది చాక్లెట్స్ ఇష్టంగా తింటారు, అయితే ఎంత తిన్నా మంచిదే అని మనం భావిస్తాం, దేనికి అయినా కాస్త లిమిట్ ఉంటుంది, చాక్లెట్స్ కి కూడా అంతే ఇది కూడా షుగర్ కంటెంట్, అలాగే ఇందులో సాగే చాక్లెట్స్ కంటే డార్క్ చాక్లెట్ చాలా మంచిది, శరీరానికి కూడా మేలు చేస్తుంది.
ఇక డార్క్ చాక్లెట్స్ రోజు రెండు బైట్లు తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి, హైపర్ టెన్షన్ కూడా దూరం అవుతుంది, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది. ప్రేమకు గుర్తుగా చాక్లెట్ ను ఇస్తే లైఫ్ లాంగ్ ఆ చాక్లెట్ మర్చిపోరు అమ్మాయిలు.
చాక్లెట్ క్యాండీని తీసుకునే వారిలో మెమరీ పవర్ పెరుగుతుంది. కొత్త ఆలోచనలో మనసులో రేకెత్తుతాయి.
డార్క్ చాక్లెట్ తినేవారిలో చర్మం కాంతివంతంగా మారుతుంది. అందుకే కొన్ని దేశాల్లో చాక్లెట్ ను పేస్ ప్యాక్ గా కూడా ఉపయోగిస్తుంటారు. అందుకే చాక్లెట్ రోజుకి కొద్ది పరిమాణంలో అయినా తీసుకోండి అంటున్నారు వైద్యులు.మరీ ఎక్కువగా మాత్రం వద్దు, ఇక తిన్నా తర్వాత కచ్చితంగా పళ్లు శుభ్రం చేసుకోవాలి లేకపోతే కావిటీ సమస్య వస్తుంది.