చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది.. దీంతో జుట్టు కూడా ఊడిపోతుంది అని బాధపడుతూ ఉంటారు… ముఖ్యంగా చుండ్రు సమస్య ఉంటే వారు ఏం తినాలి అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు… అయితే వయసు పెరిగేకొద్ది జుట్టు ఊడితే ఒకేకాని చుండ్రుతో ఊడితే సమస్యలు చాలా వస్తాయి.
చుండ్రు పడితే దురద, ఇరిటేషన్ కూడా వస్తాయి. సోరియాసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా బయోటిన్ డెఫిషియన్సీ వంటివి ఉన్నప్పుడు ఆ సందర్భాల లో ఎక్కువగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అయితే నెలలు దాటుతున్నాఈ సమస్య తగ్గకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
ఆండ్రోజెన్స్ అనేవి ఎక్కువగా కొందరికి ఉండడం వల్ల ఎక్కువ నూనె ఉంటుంది. దీని కారణంగా చుండ్రు కి కారణం అవుతుంది. ఇది కూడా చాలా కేసుల్లో చూశారు వైద్యులు… తల స్నానం చేయడం మానేస్తారు కొందరు దీని వల్ల కూడా చుండ్రు ఎక్కువగా వస్తుంది. కనీసం మూడు లేదా నాలుగు రోజులకి ఓసారి ఆయిల్ పెట్టుకోవడం, తల స్నానం చేయడం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు వాడే దువ్వెన్న మరొకరికి ఇవ్వద్దు.