రోజు ఉదయం లేవగానే కచ్చితంగా కాఫీ తాగనిదే ఏపని చేయము అంటారు కొందరు, అంతేకాదు కాఫీ తాగితేనే మా బండి నడుస్తుంది అనేవారు ఉన్నారు, బెడ్ కాఫీ తాగేవారు మన దేశంలో 25 శాతం ఉన్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు కాఫీకి ఎంత డిమాండ్ ఉందో, ఇక ఏ మీటింగ్ అయినా చిట్ చాట్ అయినా కాఫీ తాగాల్సిందే అయితే కాఫీ తాగితే లాభాలు నష్టాలు ఏమిటో చూద్దాం..
కాఫీలో మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఔషధగుణాలున్న పదార్థం ఉంటుంది..కాఫీ తాగగానే కాస్త ఉత్తేజం వస్తుంది, ఏ పని అయినా చేయడానికి ముందుకు వస్తారు. అయితే హై బీపీ ఉన్న వారు కాఫీ తాగిన వెంటనే బీపీ పెరుగుతుంది అందుకే కాస్త వారు ఎక్కువ కాఫీ తీసుకోకూడదు.
కాఫీ యాంగ్జైటీ పెరుగుదలకు కారణమవుతుంది. తద్వారా శరీరంలో కొన్నిసార్లు వణుకు కనిపిస్తుంది. ఇక రెండు సార్లు కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.