జలుబు వెంటనే తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

జలుబు వెంటనే తగ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి

0
104

ఇక ఎండాకాలం వెళ్లిపోయింది ఇప్పుడు వర్షాకాలం ఎంటర్ అయింది, ఈ సమయంలో వైరల్ ఫీవర్లు జలుబు దగ్గు ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి, అందుకే కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి, సాధారణ పైప్ నీరు తాగద్దు అంటున్నారు నిపుణులు, ఇక వర్షంలో తడిచి తల తుడుచుకోకపోయినా జలుబు సమస్య వస్తుంది.

కొందరికి జలుబు ఉండదు కానీ ముక్కు దిబ్బడ మాత్రం ఉంటుంది. దీంతో గాలి పీల్చుకోవడం కష్టతరమవుతుంది. మరి కొన్ని చిట్కాలు పాటిస్తే అది తగ్గుతుంది, ముక్కు రంద్రాలు క్లీన్ అవ్వాలి కాబట్టీ ముందు మీరు రోజుకి రెండు మూడుసార్లు ఆవిరి పట్టాలి.

ఇక పచ్చి వెల్లుల్ని రెబ్బలు తీసుకోండి వాటిని నేరుగా తిన్నా మంచిదే లేదా అన్నంలో కలుపుని తీసుకున్నా మంచిదే దీంతో ముక్కు దిబ్బడ తగ్గుతుంది. అలాగే మరో చిట్కా ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గుతుంది. రెండు సార్లు టమాటా జ్యూస్ను తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక జలుబు ముక్కు కారుతూ ఉన్నా శ్లేష్మం వస్తున్నా తులసి నీరు మిరియాల కషాయం లాంటివి తాగితే గొంతు నొప్పి జలుబు తగ్గుతాయి. గోరు వెచ్చని నీటిలో పసుపు వేసుకుని తాగినా మంచిదే.