సాధారణంగా కడుపునొప్పి వస్తే మనం తిన్న ఫుడ్ సరిగ్గా డైజిస్ట్ అవ్వలేదు అని అనుకుంటాం. వెంటనే వాము నీరు లేదా ఇంట్లో పెద్దలు చెప్పినవి ఫాలో అవుతాము. అయితే ఈ సమస్య అదే పనిగా వస్తుంటే తప్పనిసరిగా డాక్టర్లు దగ్గరకు వెళ్తాం. స్కానింగ్లో ఏదైనా కణితిలు లాంటివి తెలిస్తే ఇక ఆలస్యం చేయకుండా ఆపరేషన్ చేయించుకుంటాం. అయితే ఒక్కోసారి అక్కడ కణితి బదులుఏదైనా పురుగు ఉంటే ఇక ఆందోళన గురించ చెప్పక్కర్లేదు.
వైద్యులు కూడా ఇలాంటి ఘటనలు విని షాక్ అయినవారు ఉన్నారు. ఇక అది బతికి ఉంటే వెంటనే వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడిన వారు ఉన్నారు. 59 ఏళ్ల ఓ ముసలాయన కడుపులో విపరీతమైన నొప్పి కారణంగా ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే అతనిని కొలొనోస్కోపీ చేయించుకోవాలని సలహా ఇచ్చారు వైద్యులు.
అతను కొలొనోస్కోపీ స్కానింగ్ చేయించుకున్నాడు, అందులో సజీవంగా ఉన్న ఓ పురుగు బయటపడింది. అది కడుపులో ఎలా వచ్చిందా అని షాక్ అయ్యారు. సుమారు రెండు గంటల ఆపరేషన్ అనంతరం ఆ పురుగును అతడి కడుపు నుంచి డాక్టర్లు బయటికి తీశారు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదు.
https://twitter.com/drkeithsiau/status/1421737504626167812
Continuing the tour of insects found during colonoscopy, I present Exhibit B: ladybird ? https://t.co/LLwIZTFPF9 pic.twitter.com/GXJAnsmyH3
— Keith Siau (@drkeithsiau) August 1, 2021