తెలంగాణలో కలకలం..రెండు లంపీ కేసులు నమోదు

0
144

తెలంగాణలో లంపీ స్కిన్ వైరస్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడం మండలంలో 2 లంపీ కేసులు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఈ వైరస్ ప్రభావంతో పశువుల శరీరంపై బొబ్బలు వస్తున్నాయి. దీనితో రైతులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.