ఈకరోనా వైరస్ కు టీకా ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి, ఫార్మా కంపెనీలు దీనిపైనే ఫోకస్ చేశాయి, అయితే పలు కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.
తాజాగా స్వీడన్కు చెందిన లైఫ్ సైన్స్ సంస్థ ఎంజైమాటికా సరికొత్త మౌత్ స్ప్రేను విడుదల చేసింది. కోల్డ్ జైమ్ మౌత్ స్ప్రే పేరుతో తీసుకొచ్చిన ఈ స్ప్రే నోటిలోని 98.3 శాతం వైరస్ను చంపేస్తుందని సంస్థ చెబుతోంది, ఇప్పుడు ఇది అందరిని ఆకట్టుకుంటోంది.
ఇప్పటి వరకూ ఇంజెక్షన్ మందులు చూశాం, కరోనాకి ఈ మౌత్ స్ప్రే బాగా పని చేస్తుందని కచ్చితంగా నోటిలో ఉన్న కరోనా వైరస్ ని అంతం చేస్తుంది అని అంటున్నారు..20 నిమిషాల వ్యవధిలోనే వైరస్ను క్రియారహితం చేస్తుందని వివరించింది. ఈ స్ప్రే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవని తెలిపింది. అయితే అసలు ఈ స్ప్రే అనేది జలుబు బాగా ఉంటే వాడతారు, కాని నిపుణుల సలహాతో వాడాలి అని చెబుతున్నారు.