కరోనా కలకలం..14 మంది విద్యార్ధులకు పాజిటివ్

Corona agitation..14 positive for students

0
73

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలో కరోనా కలకలం రేపింది.

రెసిడెన్సియల్‌ కాలేజీలోని 14 మంది విద్యార్థులు కొవిడ్‌ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతున్న 90 విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీనితో\విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.