ఆర్మీ బెటాలియన్‌లో కరోనా కలకలం

Corona agitation in the Army Battalion

0
101

దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఈమధ్య కరోనా కేసులు తగ్గుమొఖం పట్టడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒమీక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అవుతుండడం, యూరోపియన్, హాంకాంగ్ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకు ప్రయాణికులు రావడం ఇప్పుడు అందిరిని టెన్షన్ కు గురి చేస్తుంది.

తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఆర్మీ బెటాలియన్‌లో కరోనా కలకలం సృష్టించింది. డెహ్రాడూన్‌ జిల్లా చక్రతాలోని బెటాలియన్‌కు చెందిన చాలా మంది జవాన్లు మహమ్మారి బారినపడినట్లు గుర్తించి, వారిని క్వారంటైన్‌కు తరలించారు.

అయితే, జవాన్లకు వైరస్‌ ఎలా సోకిందనే విషయంపై ఆరోగ్యశాఖ సమాచారం సేకరిస్తుంది. ఇప్పటికే ముగ్గురు మిలటరీ హాస్పిటల్‌లో చేరారు. జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ రాజీవ్ దీక్షిత్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇప్పుడు డూన్ మెడికల్ కాలేజీలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు.