రోజూ కాఫీ టీ తాగకపోతే అసలు రోజు ముందుకు సాగదు కొందరికి… అందుకే ఎంత కరోనా సమయంలో అయినా బయట నుంచి పాలు తెచ్చుకోవడం.. టీ కాఫీ తాగి పని మొదలు పెట్టడం చేస్తూ ఉంటారు, అయితే ఇక్కడ ఓ ప్రముఖ డాక్టర్ ఓ కీలక విషయ చెబుతున్నారు.
మీరు బయట నుంచి తెచ్చుకునే పాలప్యాకెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు, మీరు తెచ్చిన పాల ప్యాకెట్ ని ముందు శుభ్రంగా కడగండి ఆ తర్వాత మీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోండి లేదా సబ్బుతో కడగండి.
ఆ తర్వాత మాత్రమే పాల ప్యాకెట్ కట్ చేయండి, అయితే పాల ప్యాకెట్ ద్వారా వైరస్ వస్తుందా? రాదు కదా అని అనుకోవడానికి లేదు.. ఈ పాలు కూడా చల్లగా ఉంటాయి, వైరస్ ఎక్కడైనా ఉండవచ్చు అందుకే ముందుజాగ్రత్తగా చెబుతున్నారు, ఇక పాల ప్యాకెట్ ఎవరు తెస్తారో వారే ఆ పాల ప్యాకెట్ కడిగి తర్వాత మీ చేయి శుభ్రం చేసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు.