అసలు ఉప్పు కారం పూర్తిగా లేకపోతే ఆ ఫుడ్ తినడానికి చాలా మంది ఇంట్రస్ట్ చూపించరు.. ఇక ఆ ఫుడ్ పక్కన పెడతారు.. అయితే ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది అని డాక్టర్లు చెబుతారు.. బీపీ పేషెంట్ల విషయంలో కూడా అదే చెబుతారు, అది చాలా డేంజర్ అని ఎక్కువగా ఉప్పు తినద్దు అంటారు.
అధికంగా ఉప్పు తీసుకున్న వారు ఆల్కహాల్ తీసుకున్న దానితో సమానం అన్నే వార్తలు అప్పట్లో బాగా వినపడుతుండేవి. ఇక డాక్టర్లు ఇప్పుడు కొత్త విషయం చెబుతున్నారు ఉప్పును కాస్త తగ్గిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. దీంతో కరోనా వైరస్‌కు ఆమడ దూరంలో ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ముఖ్యంగా రోగ నిరోధకశక్తి చాలా మందిలో తక్కువ ఉంటుంది ..అలాంటి వారు ఉప్పుకి కాస్త దూరం ఉండాలి అంటున్నారు, చాలా మంది సెలబ్రెటీలు కూడా ఉప్పు తక్కువ తీసుకుంటారు.
ఒక వ్యక్తి రోజుకు ఐదుగ్రాములకు మించకుండా వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం క్లోరైడ్ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా గుండె జబ్బులకు కూడా దారితీస్తుంది.