తెలంగాణలో కరోనా విజృంభణ..హెల్త్ బులెటిన్ రిలీజ్..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

0
90

తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,11,178 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,557 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,18,196కు చేరాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది.

కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,065కు చేరింది. కరోనా బారి నుంచి కొత్తగా 1,773 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 6,89,878 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,253 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 1,474 కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

ఆదిలాబాద్ 30
కొత్తగూడెం 72
జిహెచ్ఎంసి 1474
జగిత్యాల 35
జనగామ 19
జయశంకర్ భూపాలపల్లి 27
జోగులాంబ గద్వాల 30
కామారెడ్డి 24
కరీంనగర్ 74
ఖమ్మం 104
కొమరం భీం ఆసిఫాబాద్ 28
మహబూబ్ నగర్ 66
మహబూబాబాద్ 46
మంచిర్యాల 77
మెదక్ 37
మేడ్చల్ మల్కాజ్ గిరి 321
ములుగు 23
నాగర్ కర్నూల్ 35
నల్లగొండ 46
నారాయణపేట 16
నిర్మల్ 26
నిజామాబాద్ 58
పెద్లపల్లి 70
రాజన్న సిరిసిల్ల 20
రంగారెడ్డి 275
సంగారెడ్డి 123
సిద్దిపేట 64
సూర్యాపేట 42
వికారాబాద్ 52
వనపర్తి 28
వరంగల్ రూరల్ 30
వరంగల్ అర్బన్ 130
యాదాద్రి భువనగిరి 55