తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. ఇవాళ ఒకేరోజు నాలుగు వేలకు పైగా మంది కొవిడ్ బారిన పడినట్టు తెలుస్తుంది. గడిచిన 24 గంటల్లో 4,393 మందికి వైరస్ నిర్ధరణ అయింది. దీనితో ఇప్పటి వరకు 7,31,212 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది.
ఇక ఈరోజు 2,319 మంది కోలుకోగా..ఇప్పటివరకు కొవిడ్ నుంచి 6,95,942 మంది రికవరీ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మృతి చెందగా.. కొవిడ్ మరణాలు 4071కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇవాళ 1643 కేసులు నమోదవడం కలకలం రేపుతోంది.
గత 24 గంటల్లో జిల్లాల వారిగా కరోనా కేసులు ఈ విధంగా ఉన్నాయి.
ఆదిలాబాద్ 53
కొత్తగూడెం 70
జిహెచ్ఎంసి 1643
జగిత్యాల 65
జనగామ 37
జయశంకర్ భూపాలపల్లి 28
జోగులాంబ గద్వాల 38
కామారెడ్డి 57
కరీంనగర్ 89
ఖమ్మం 128
కొమరం భీం ఆసిఫాబాద్ 31
మహబూబ్ నగర్ 93
మహబూబాబాద్ 77
మంచిర్యాల 88
మెదక్ 56
మేడ్చల్ మల్కాజ్ గిరి 421
ములుగు 28
నాగర్ కర్నూల్ 72
నల్లగొండ 67
నారాయణపేట 31
నిర్మల్ 37
నిజామాబాద్ 65
పెద్లపల్లి 98
రాజన్న సిరిసిల్ల 61
రంగారెడ్డి 286
సంగారెడ్డి 89
సిద్దిపేట 70
సూర్యాపేట 63
వికారాబాద్ 78
వనపర్తి 58
వరంగల్ రూరల్ 67
వరంగల్ అర్బన్ 184
యాదాద్రి భువనగిరి 65