తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే?

Corona booming in Telangana..how many new cases?

0
95

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం కలుగుతుంది.

తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 90021 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2319 మందికి పాజిటివ్‌‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి ధాటికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,047కి చేరుకుంది. కరోనా బారి నుంచి 474మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18339యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది. ఒక్క GHMC లోనే 1275 కేసులు నమోదు కావడం గమనార్హం. అలాగే మేడ్చల్ లో  234, రంగారెడ్డిలో 173 కేసులు నమోదు అయ్యాయి.

అయితే రాష్ట్రంలో కరోనా ఆంక్షలను ఈనెల 20 వ‌ర‌కు పెంచ‌డంతో రోజువారీ కేసుల సంఖ్య కాస్త త‌గ్గే అవ‌కాశం కనిపిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధ‌న‌లు పాటిస్తే కేసుల సంఖ్యను అదుపులో ఉండే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.