దేశంలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?

0
93

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజూవారీ కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్ దాటి రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో (మంగళవారం) కేసుల సంఖ్య భారీగా పెరిగింది.

దేశ వ్యాప్తంగా నిన్న 2,82,970 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 441 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోల్చుకుంటే.. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 44,889 కేసులు, 131 మరణాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా నిన్న కరోనా నుంచి 1,88,157 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,55,136,039 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. రోజూవారి పాజిటివిటీ రేటు 15,13 శాతానికి చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 18,31,000 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

మొత్తం మరణాలు: 4,87,202

యాక్టివ్ కేసులు: 18,31,000

మొత్తం కోలుకున్నవారు: 3,55,83,039