పండుగ పూట పెరిగిన కరోనా కేసులు..తాజా హెల్త్ బులెటిన్ విడుదల..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

0
82

కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. గతంలో కరోనా కట్టడికి చేపట్టిన లాక్‌డౌన్‌, ఇతర ఆంక్షల కారణంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో (శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు) 30,022 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..4,570 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా మహమ్మారి ఈ 24 గంటల్లో ఒక్కరిని బలి తీసుకుంది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,03,385కి చేరగా.. ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది.  ప్రస్తుతం ఏపీలో 26770 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ మేరకు ఆరోగ్య శాఖ ఆదివారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా గడిచిన 24 గంటల్లో జిల్లాల వారీగా కేసులు ఈ విధంగా ఉన్నాయి.

అనంతపురం  347

చిత్తూరు         1124

ఈస్ట్ గోదావరి   213

గుంటూరు 368

వైస్సార్ కడప 173

కృష్ణ   207

కర్నూల్  168

నెల్లూరు   253

ప్రకాశం    178

శ్రీకాకుళం 187

విశాఖపట్నం  1028

విజయవాడ   209

వెస్ట్ గోదావరి   95