కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుంది. దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్ మొదలైందనే అనిపిస్తుంది. తాజాగా తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో 48,583 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,673 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ రిలీజ్ చేసింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 6,94,030కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి ధాటికి ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు.
దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 4,042కి చేరుకుంది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజు 330 మంది కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య తెలిపింది. ఒక్క GHMC లోనే 1165 కేసులు నమోదు కావడం గమనార్హం.
ఆదిలాబాద్ 7
కొత్తగూడెం 4
జిహెచ్ఎంసి 1165
జగిత్యాల 4
జనగామ 1
జయశంకర్ భూపాలపల్లి 2
జోగులాంబ గద్వాల 2
కామారెడ్డి 3
కరీంనగర్ 16
ఖమ్మం 10
కొమరం భీం ఆసిఫాబాద్ 2
మహబూబ్ నగర్ 13
మహబూబాబాద్ 15
మంచిర్యాల 10
మెదక్ 7
మేడ్చల్ మల్కాజ్ గిరి 149
ములుగు 0
నాగర్ కర్నూల్ 3
నల్లగొండ 8
నారాయణపేట 3
నిర్మల్ 13
నిజామాబాద్ 5
పెద్లపల్లి 1
రాజన్న సిరిసిల్ల 123
రంగారెడ్డి 44
సంగారెడ్డి 8
సిద్దిపేట 3
సూర్యాపేట 5
వికారాబాద్ 3
వనపర్తి 3
వరంగల్ రూరల్ 23
వరంగల్ అర్బన్ 34
యాదాద్రి భువనగిరి 3